అభివృద్ధిలో అశ్వరావుపేటను ముందుంచుతా : ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి

అభివృద్ధిలో అశ్వరావుపేటను ముందుంచుతా : ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
  • ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి

ములకలపల్లి, వెలుగు: జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో  అభివృద్ధి చేసి మోడల్ గా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ములకలపల్లి మండలంలో రూ 2.68 కోట్ల అభివృద్ధి పనులను ఎంపీ ప్రారంభించారు.  సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగులు, బీటీ రోడ్డు, అంగనవాడీ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన,  క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను లబ్ధిదారులకి అందజేశారు. 

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, నాగళ్ల వెంకటేశ్వరరావు, గాడి తిరుపతిరెడ్డి, కారం సుధీర్, సురభి రాజేశ్, శనగపాటి రవి, అంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.