టేకులపల్లి, వెలుగు : సర్పంచ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. టేకులపల్లి మండలానికి చెందిన సీనియర్ నాయకులు భూక్య దల్ సింగ్ నాయక్, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు ఆదివారం మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇరువురి నేతలను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడించారు.
ఇరువురిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, నాయకులు దిండిగల రాజేందర్, హర్సింగ్ నాయక్, బోడ బాలు, రామ నాయక్, కిషన్ నాయక్, జాలాది అప్పారావు, లాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు
