బీసీ బిల్లు కోసం పోరాడుతాం : వద్దిరాజు రవిచంద్ర

బీసీ బిల్లు కోసం పోరాడుతాం : వద్దిరాజు రవిచంద్ర

సత్తుపల్లి, వెలుగు : బీసీ బిల్లు కోసం పోరాడుతామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి  తొలిసారి జిల్లాకు విచ్చేసిన వద్దిరాజు రవిచంద్రను శుక్రవారం సత్తుపల్లిలో మండల బీసీ సంఘాలు ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపిస్తే బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేలా పోరాడుతామన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు చాగంటి శ్రీనివాసరావు మాధురి మధు సుంకర వాసు, పెద్దిరెడ్డి పురుషోత్తం, రాము, యోగానందం, వినుకొండ వెంకటేశ్వర రావు, యాస రాంబాబు తదితరులు పాల్గొన్నారు.