బాలికపై ఎంపీటీసీ అత్యాచార యత్నం

బాలికపై ఎంపీటీసీ అత్యాచార యత్నం

వైరా, వెలుగు: బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన టీఆర్ఎస్​ ఎంపీటీసీని పోలీసులు అరెస్ట్ ​చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా  వైరా మండలం  లింగన్నపాలెం గ్రామానికి చెందిన బాలిక(14) ఇంటికి మూడు రోజుల క్రితం విప్పలమడక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ బూర్గు సంజీవరావు(42) వెళ్లాడు. ఆ టైంలో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడంతో ఆమె భుజం మీద చేయి వేసి  బలవంతం చేయబోయాడు. బాలిక కేకలు వేయ డంతో ఎంపీటీసీ పారిపోయాడు.  తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తరువాత బాలిక జరిగిన ఘటనను వారికి తెలియజేసింది. గ్రామ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో బాలిక తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అదేరోజు రాత్రి ఎంపీటీసీ సంజీవరావును పోలీసులు అరెస్టు చేశారు.

బండి సంజయ్, బీజేపీ లీడర్ల పరామర్శ
బాధితురాలి కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అరుణ, జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్   నెల్లూరీ కోటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా  బీజేపీ స్టేట్​ప్రెసిడెంట్​బండి సంజయ్​బాధితులతో ఫోన్​లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని, బాలికకు న్యాయం జరిగేవరకు పోరాడతామని బీజేపీ లీడర్లు అన్నారు. ఎంపీటీసీని పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. పరామర్శించిన వారిలో  మైనార్టీ మోర్చా అధ్యక్షులు అన్వర్ పాషా, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దిద్దుకూరి కార్తీక్, అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేశ్, వైరా మండల అధ్యక్షుడు భద్రయ్య , నాయకులు వెంకటకృష్ణ , నరేశ్,  సతీశ్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పద్మ ఉన్నారు.