Mrunal Thakur: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృణాల్ పూజలు.. పేరెంట్స్ చెప్పారట

Mrunal Thakur: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృణాల్ పూజలు.. పేరెంట్స్ చెప్పారట

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే నానితో హాయ్ నాన్న(Hai Nanna) చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ది ఫ్యామిలీ స్టార్(The Family Star) అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడు పరశురామ్(Parasuram) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తుండగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. 

ఇదిలా ఉంటే.. తాజాగా మృణాల్ ఠాకూర్ హైద్రాబాద్ లోని ఫేమస్ బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇదే విషయని తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు మృణాల్. ఏదైనా కొత్త, లేదా పెద్ద పనులను మొదలుపెట్టేటప్పుడు పూజ చేయమని, వీలైతే గుడికి కూడా వెళ్ళమని మా పేరెంట్స్ చెప్పారు. అందుకే మా ఫ్యామిలీ స్టార్ సినిమా  ప్రమోషన్స్ మొదలుపెట్టేముందు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ని దర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు మృణాల్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.