హైదరాబాద్, వెలుగు: క్లీన్ ఎనర్జీ, సివిల్ న్యూక్లియర్ పవర్, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు పరికరాలను అందించే హైదరాబాద్ కంపెనీ ఎంటార్ టెక్నాలజీస్ 2025 డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ఫలితాలు ప్రకటించింది. 2024 క్యూ3తో పోలిస్తే కంపెనీ ఆదాయం 59.3 శాతం పెరిగి రూ.278 కోట్లుగా నమోదైంది. అప్పుడు ఆదాయం రూ.174.5 కోట్లుగా ఉంది. నికర లాభం 117.3 శాతం పెరిగి రూ.34.7 కోట్లుగా రికార్డు అయ్యింది. ఇబిటా 92.5 శాతం వృద్ధితో రూ.64 కోట్లకు చేరుకుంది. రెండవ క్వార్టర్ ఫలితాలతో పోలిస్తే మూడవ క్వార్టర్ లో కంపెనీ ఆదాయం 105 శాతం పెరిగింది. పన్నుకు ముందు లాభం ఏకంగా 712.6 శాతం వృద్ధి చెంది రూ.46.1 కోట్లకు చేరింది.
