IND vs AUS : అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ లో షమీకి చోటు 

IND vs AUS : అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ లో షమీకి చోటు 

డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు (narendra modi stadium) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లకు కీలకం కానుంది. అయితే, ఈ మ్యాచ్ ను (IND vs AUS) భారత్ సీరియస్ గా తీసుకుంది. బ్యాటింగ్ తో పాటు పేస్ బౌలింగ్ పైన కూడా దృష్టి పెట్టింది. (muhammad siraj) ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల్లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసిన మహమ్మద్ సిరాజ్ ను తొలగించి (muhammad shami) మహమ్మద్ షమీని తిరిగి జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 
  
చెత్త బ్యాటింగ్, పస లేని ఫేస్ బౌలింగ్, కెప్టెన్సీ వ్యూహాల్లో ఫేయిల్ అవ్వడంతో మూడో టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. దీంతో సీనియర్ ప్లేయర్లు, అభిమానులు నుంచి టీమిండియా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. అయితే, ఈ మ్యాచులో ప్లేయింగ్ లెవన్ పై దృష్టి సారించిన మేనేజ్మెంట్ షమీని తీసుకోనున్నారు. 

ఈ మ్యాచ్ లో ఫలితం ఏదైనా ఆసీస్ కు అంత నష్టం ఏం జరుగదు. కానీ, భారత్ మాత్రం తప్పకుండా గెలిచి తీరాలి. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ ఫైనల్ కు చేరుతుంది. లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లో లంక ఓటిమి కోసం వేచి చూడాలి.