AI కోసం ముఖేష్ అంబానీ కొత్త కంపెనీ.. అసలు రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే..?

AI కోసం ముఖేష్ అంబానీ కొత్త కంపెనీ.. అసలు రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే..?

Reliance Intelligence: ముఖేష్ అంబానీ దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. క్రూడ్ ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాల్లో విస్తరించిన రిలయన్స్ ఒక టెక్ సంస్థగా కూడా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మారుతున్న వ్యాపార అవసరాలను అందిపుచ్చుకునేందుకు అంబానీ రిటైల్ నుంచి టెక్ వరకు తన ఫోకస్  మార్చుతున్నారు. 

ఆగస్టు 29న జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)లో ఆయన తన ఏఐ కలలకు సంబంధించిన కొత్త వ్యాపార ఆలోచనలను స్టేక్ హోల్డర్లకు వివరించారు. ఏఐలో రిలయన్స్ ముందుకు సాగేందుకు వీలుగా రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సబ్సిడరీ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ముఖేష్ అంబానీ. ఇది భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని  ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్య పాత్ర పోషించనుందని వెల్లడించారు. రిలయన్స్ ఇంటెలిజెన్స్ సంస్థ గ్రీన్ ఎనర్జీపై ఆధారపడి, గిగావాట్ స్కేల్ పిల్లింగ్ ఏఐ రెడీ డేటా సెంటర్ల నిర్మించాలని నిర్ణయించింది. జామ్‌నగర్‌లో ఇండియన్ నేషనల్ AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తేలింది.

►ALSO READ | సెప్టెంబర్‌లో మారుతున్న రూల్స్.. ఆధార్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు.. తప్పక తెలుసుకోండి..

ఈ కొత్త ప్రణాళికతో రిలయన్స్ ప్రపంచంలోని ఉత్తమ సాంకేతిక కంపెనీలను, ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలను కలుపుకొని AIలో రీసెర్చ్, అభివృద్ధికి దోహదపడేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి తోడు రిలయన్స్ ఈ ఏఐ ప్లాట్‌ఫార్లను తమ వ్యాపార సంస్థల్లో కూడా ప్రవేశపెట్టి ప్రయోజనం పొందాలని ప్రణాళికతో ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో రిటైల్, టెలికాం, ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాల్లో ఏఐని బ్లెండ్ చేయాలని చూస్తోంది. 

కొత్త కంపెనీ ఏర్పాటు ద్వారా రిలయన్స్ దేశంలో ఏఐ రంగాన్ని దూసుకెళ్లించే గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని ముఖేష్ అంబానీ ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇందులో భాగంగానే జామ్‌నగర్ లో డేటా సెంటర్లను అమెరికా దిగ్గజ చిప్ మేకర్ ఎన్వీడియాతో కలిసి నిర్మిస్తోంది రిలయన్స్ గ్రూప్. దీనికోసం అత్యాధునిక బ్లాక్వెల్ ఏఐ ప్రాసెసర్లు, సెమీకండక్టర్లను అక్కడ వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రిలయన్స్. దీని ద్వారా ముఖేష్ అంబానీ సైతం ఈ డేటా సెంటర్ల నిర్మాణంతో జామ్‌నగర్‌ను ప్రపంచ ఏఐ పరిశోధనలో ఒక కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.