హైదరాబాద్, వెలుగు: పాంటోమత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్‌కు చెందిన ది వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్, తమ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఈక్విటీలు, డెట్ కమోడిటీలలో పెట్టుబడులు పెట్టే హైబ్రిడ్ ఫండ్. ఎన్ఎఫ్‌వో ఈ నెల 19న ప్రారంభమై వచ్చే నెల మూడున ముగుస్తుంది.
ఈ ఫండ్ దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఈక్విటీలు, స్థిరత్వం కోసం ఫిక్సిడ్ ఇన్‌కమ్ స్కీములు, ద్రవ్యోల్బణం, హెడ్జింగ్ డైవర్సిఫికేషన్ కోసం బంగారం, వెండి లాంటి లోహాలపై ఫోకస్చేస్తుంది. హైబ్రిడ్ ట్యాక్సేషన్ నిబంధనల ప్రకారం పన్నుల ప్రయోజనాలు ఉంటాయి. కమోడిటీలకు 50 శాతం వరకు కేటాయించే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల వివిధ మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడులను సర్దుబాటు చేస్తారు.
