వెంకటాపూర్ లో భూ భారతి అప్లికేషన్స్ 1244

వెంకటాపూర్ లో  భూ భారతి అప్లికేషన్స్ 1244

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: భూ భారతి చట్టం పైలట్ మండలంగా ఎంపికైన ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో రెండో రోజు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ గిరిబాబు తెలిపారు. మొదటిరోజు 756,  రెండో రోజు 1244 అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఇందులో సాదా బైనమా కేటగిరిలో 371, కొత్త పట్టా పాస్ బుక్ కోసం 562, విస్తీర్ణం తక్కువ నమోదు 90 అసైన్ భూమి సమస్యలు 89, పాస్ బుక్ లో తప్పులు కరెక్షన్ 33, ఇతర సమస్యలకు 81 దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్ తెలిపారు. రామాంజపూర్ రెవెన్యూ సదస్సులో 429 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు.