ముంబై షాక్ : మీ హోటల్ అమ్మేయండి.. దావూద్ తరపున ఆ ఎమ్మెల్యే బెదిరించారా..?

ముంబై షాక్ : మీ హోటల్ అమ్మేయండి.. దావూద్ తరపున ఆ ఎమ్మెల్యే బెదిరించారా..?

దావూద్ ఇబ్రహీం.. భారతీయుల ప్రాణాలను నడ్డిరోడ్డుపై చంపిన కిరాతకుడు.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తన మాఫియా గ్యాంగ్ ద్వారా దందాలు చేసే క్రిమినల్.. పాకిస్తాన్ దేశంలో తలదాచుకుని.. ఇండియాలో తన నెట్ వర్క్ ద్వారా దందాలు, దోపిడీలు, డ్రగ్స్ ఇలాంటి ఎన్నో వ్యాపారులు చేస్తున్నాడనేది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. కొన్నాళ్లుగా ముంబైలో దావూద్ కార్యకలాపాలు తగ్గాయి అనుకుంటున్న సమయంలో.. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబై సిటీ మధ్యలో మెరైన్ డ్రైవ్ లోని హోటల్ మెరైన్ ప్లాజా.. ఇది  ముంబై సిటీలో ఫేమస్ హోటల్. ఈ హోటల్ ను అమ్మేయాలని.. తక్కువ ధరకు అమ్మాలంటూ ఆ హోటల్ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు దావూద్ గ్యాంగ్. అండర్ వరల్డ్ నుంచి హోటల్ యజమానులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే హస్తం కూడా ఉన్నట్లు పోలీస్ కంప్లయింట్ ఫైల్ అయ్యింది. అండర్ వరల్డ్.. దావూద్ గ్యాంగ్ నుంచి వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ పై.. హోటల్ మెరైన్ ప్లాజా ఓనర్లు.. తమ దగ్గర ఉన్న ఫోన్ ఆడియో క్లిప్స్ ను సైతం పోలీసులకు అందజేశారు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవటంతో.. ఏకంగా వాళ్లు ముంబై హైకోర్టుకు వెళ్లారు. హోటల్ ఓనర్లు దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన ముంబై హైకోర్టు.. దీనిపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించటంతో.. ముంబైలో మరోసారి అండర్ వరల్డ్ కార్యకలాపాలపై హాట్ డిస్కషన్ నడుస్తుంది.

వాస్తవంగా ఈ మెరైన్ ప్లాజా హోటల్ వ్యవహారం ఇప్పటిది కాదు. 30 ఏళ్ల క్రితం.. అంటే 1992లో ట్రస్టీలు హోటల్ నిర్వహణ కోసం షోర్‌లైన్‌ అనే సంస్థతో 30 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకున్నారు. దీన్ని అప్పట్లో బాంబే ఇంటర్నేషనల్ హోటల్ అని పిలిచేవారు. 2022, ఫిబ్రవరిలో ఈ ఒప్పందం ముగిసింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. లీజుకు తీసుకున్న షోర్‌లైన్ సంస్థ.. దాని డైరెక్టర్లు రహీమ్ మరేడియా, మునీర్ భర్వానీ హోటల్‌ను ఖాళీ చేయడానికి నిరాకరించారు. ట్రస్టీలను సైతం హోటల్ ఆవరణలోకి రానీయకుండా అడ్డుకున్నారు. 500 కోట్ల రూపాయల విలువైన హోటల్ ను కబ్జా చేశారు.

లీజుకు తీసుకున్న ఫోర్ లైన్ డైరెక్టర్లు.. ఇప్పుడు హోటల్ అమ్మేయాలంటూ ట్రస్టీలను బెదిరిస్తున్నారు. అమ్మకం కుదరదని.. హోటల్ అప్పగించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. అక్కడ పరిష్కారం లేకపోవటంతో.. కోర్టుకు వెళ్లారు. ఫోర్ లైన్ డైరెక్టర్ల వెనక దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రస్టీలను బెదిరించిన ఆడియోలు సైతం.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయంటున్నారు ట్రస్టీ తరపు లాయర్లు. ఈ ఆడియోలో.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జావేద్ ష్రాఫ్ మాటలు కూడా ఉన్నాయి. వివాదాన్ని కూర్చుని పరిష్కరించుకోండి.. చెప్పిన ధరకు.. ఇచ్చిన డబ్బు తీసుకుని హోటల్ అప్పగించండి.. సెటిల్ మెంట్ చేసుకోండి అంటూ ట్రస్టీలతో చెప్పటం సంచలనంగా మారింది.

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కు చెందిన వ్యక్తులు సైతం.. ట్రస్టీలకు ఫోన్ చేసి తక్కువ ధరకు హోటల్ అమ్మేయాలంటూ ఒత్తిడి తీసుకురావటం కలకలం రేపుతుంది. దీంతో ట్రస్టీలు హైకోర్టును ఆశ్రయించటం.. కోర్టు వారికి అనుకూలంగా ఆదేశాలు ఇస్తూ.. రెండు వారాల్లో పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించటంతో.. ఈ విషయం ఇప్పుడు ముంబైలో ఆసక్తి రేపుతోంది.

500 కోట్ల రూపాయల విలువైన ఆస్తి విషయంలో.. దావూద్ అండ్ గ్యాంగ్ ప్రమేయం ఉందా.. అండర్ వరల్డ్ గ్యాంగ్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యిందా అనే కోణంలోనూ ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేస్తుంది.