వరదలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్

వరదలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్

ముంబయిలో కురుస్తున్న వర్షాలకు రోడ్డు,రైలు మార్గాలు నీటితో నిండిపోయాయి. వర్షం ధాటికి రైల్వే పట్టాలపై నీళ్లు నిలవడంతో కోల్హాపూర్‌-ముంబయి మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గం మధ్యలో ఉల్హాన్‌ సాగర్‌ వద్ద నిలిచిపోయింది. రైలులో 700 మందికి పైగా ప్రయాణీకులున్నారు.ఈ ప్రయాణీకులను రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే కొందరు ప్రయాణికులను రక్షించారు. స్థానిక పోలీసులు, రైల్వే సిబ్బంది, రైల్వే రక్షక దళాలు హెలికాప్టర్ల ద్వారా అక్కడికి చేరుకుని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. ఉల్హాస్‌ నది ఉధృతంగా పారుతుండటంతో బద్లాపూర్‌ పరిధిలోని చమ్తోలి వద్ద రైల్వే ట్రాక్‌ మొత్తం నీటిలో మునిగిపోయిందని థానె రెసిడెంట్‌ డిప్యూటీ కలెక్టర్‌ శివాజీ పాటిల్‌ చెప్పారు.