అవునా.. : ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ పర్సు కొట్టేసిన దొంగలు

అవునా.. : ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ పర్సు కొట్టేసిన దొంగలు

నెదర్లాండ్స్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళ పర్సు దక్షిణ ముంబైలో చోరీకి గురైంది. ఫిర్యాదుదారు సెలీనా గాయత్రి హరి చంద్రప్రకాష్ బిహారీ (58) డచ్ పౌరురాలు. నెదర్లాండ్స్‌లో ఆదాయపు పన్ను శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె పర్సులో మొత్తం రూ.8.93 లక్షలు ఉన్నాయి.

లోకమాన్య తిలక్ (ఎల్‌టి) మార్గ్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సెలీనా తన సోదరీమణులు ఇడిత్ ఇంద్రాణి బిహారీ, లిడియాతో కలిసి భారతదేశాన్ని సందర్శించడానికి సెప్టెంబర్ 22న ఢిల్లీకి వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లింది. ఈ క్రమంలో సెలీనా సోదరితో కలిసి షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఆమె పర్సు చోరీకి గురైంది.

ALSO READ : భారత్ కు చేరుకున్న టాంజానియా అధ్యక్షురాలు

అక్టోబర్ 4న సాయంత్రం, 6:30 గంటల ప్రాంతంలో, సెలీనా, ఇడిత్ షాపింగ్ కోసం భులేశ్వర్ మార్కెట్‌కు వెళ్లారు. సెలీనా డబ్బుతో ఉన్న తన బ్రౌన్ పర్సును ఇడిత్ బ్యాగ్‌లో ఉంచింది. మార్కెట్‌లో బట్టల కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు, సెలీనా ఇడిత్ బ్యాగ్‌లో నుంచి తన పర్సును తీయడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే బ్యాగ్ జిప్పర్ తెరిచి ఉంది, ఆమె పర్సు కనిపించకపోవడంతో వారు తమ పర్స్ చోరీకి గురైందని గుర్తించారు.

తన పర్సు తప్పిపోయిందని తెలుసుకున్న సెలీనా ఎల్‌టి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 379 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెలీనా బ్యాగ్‌లో ఆమె నెదర్లాండ్స్ ప్రభుత్వ ఐ-కార్డ్, ABN అమ్రో బ్యాంక్ డెబిట్ కార్డ్, 202 యూరోలు (భారత మార్కెట్లో రూ. 8లక్షల 88వేల 800కి సమానం), భారత కరెన్సీలో రూ. 5వేలు కూడా ఉన్నాయి. ఎల్‌టీ మార్గ్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. వివరాల కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.