
ఏకకాలంలో మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్ -వంటి సీజనల్ వ్యాధులు సోకడం మీరెప్పుడైనా చూశారా..ఇలాంటి అరుదైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో 14 యేళ్ల బాలుడికి చికిత్స చేసిన డాక్టర్లకు వైద్య చరిత్రలో దిగ్బ్రాంతికరమైన వివరాలు తెలిసి షాక్ అయ్యారు. ఏడు రోజుల పాటు చికత్స చేసినా ఆ బాలుడి మృత్యువునుంచి తప్పించుకోలేకపోయాడు. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని కుర్లాకు చెందిన 14 యేళ్ల బాలుడు ఆగస్టు 14న జ్వరం, కామెర్లతో స్థానిక కస్తూర్బా ఆస్పత్రిలో చేరిన బాలుడుకి వారం రోజుల పాటు స్థానిక వైద్యులు చికిత్స చేశారు.. అయినా కోలుకోలేదు.. దీంతో కస్తూర్బా ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేయగా వైద్య బృందాన్ని ఆశ్చర్యపర్చే విధంగా డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్ సోకినట్లు తేలింది. అతని క్రియాటినిన్ స్థాయిలు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి పరిస్థితి విషమించింది. ముంబై సెంట్రల్ లోని నాయర్ ఆస్పత్రికి తరలించినా ఫలితంలేదు.. బాలుడి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్ వంటి సీజనల్ వ్యాధులు ఒకేసారి ఏకకాలంలో సోకడం అరుదైన ఘటన అని డాక్టర్లు అంటున్నారు. అయితే కొంచెం ముందు గనక చికిత్స అందితే బాలుడి బతికేవాడని డాక్టర్లు చెబుతున్నారు. ఏకకాలంలో మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్ -వంటి సీజనల్ వ్యాధులు సోకడం మీరెప్పుడైనా చూశారా..ఇలాంటి అరుదైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో 14 యేళ్ల బాలుడికి చికిత్స చేసిన డాక్టర్లకు వైద్య చరిత్రలో దిగ్బ్రాంతికరమైన వివరాలు తెలిసి షాక్ అయ్యారు. ఏడు రోజుల పాటు చికత్స చేసినా ఆ బాలుడి మృత్యువునుంచి తప్పించుకోలేకపోయాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ముంబైలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. దీంతోపాటు లెప్టోస్పిరోసిస్ కేసులు కూడా ఉన్నాయని ముంబై వైద్యులు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ గణాంకాలు.. ఆగస్టులో మలేరియా , డెంగ్యూ కేసులు రెండింటిలో పెరుగుదలను చూపించాయి. 959 మలేరియా కేసులు నమోదు కాగా.. జూలైలో 721 ,జూన్‌లో 676 కేసులు పెరిగాయి.
అదేవిధంగా జులైలో 685, జూన్‌లో 353 డెంగ్యూ కేసులు 742కు పెరిగాయి. లెప్టోస్పిరోసిస్ కేసులు జూలైలో 413 నుండి ఆగస్టులో 265కి తగ్గాయని నివేదిక పేర్కొంది.