లాల్ బాగ్చా గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాకులకు జరిమానా

లాల్ బాగ్చా గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాకులకు జరిమానా

ముంబయిలో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ ఉత్సవాలలో భాగంగా అక్కడ లాల్‌బాగ్చా రాజా గణేష్ కమిటీ ఏటా నిర్వహించే ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అంత గొప్పదిగా చెప్పుకునే లాల్ బాగ్చా గణేశ్ నిర్వాహకులకు తాజాగా బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఫైన్ వేసింది. అది వందో, వేలో కాదు.. ఏకంగా మూడు లక్షల 66వేల రూపాయలు. ఇంతకీ ఏం జరిగింది.. ఎందుకు ఫైన్ వేశారు.. అన్న విషయానికొస్తే..

ఎప్పటిలాగే ఈ ఏడాదీ గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు లాల్ బాగ్చా గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేసేందుకు గుంతలు తవ్వినట్టు సమాచారం. అందులో భాగంగా183 గుంతలు సృష్టించినందుకు గానూ అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో గుంతకు రూ.2000 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. అంటే మొత్తం రూ.3.66లక్షల జరిమానా చెల్లించాలన్నమాట. ఇటీవల జరిగిన గణేశ్ ఉత్సవాల అనంతరం తనిఖీలు చేపట్టిన మున్సిపల్ అధికారులు.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.