కార్మికుల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న మున్సిపల్ కమిషనర్

కార్మికుల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న మున్సిపల్ కమిషనర్

జగిత్యాల జిల్లా: ఆమె ఒక మున్సిపల్ కమిషనర్. అందరి ఆఫీసర్లలాగా ఆఫీసులో కూర్చొని.. అధికారులు, కార్మికులపై అజమాయిషీ చేయలేదు. వాస్తవం ఏంటో  తెలుసుకునేందుకు ఫీల్డ్ లోకి దిగారు. మున్సిపల్ శానిటేషన్ కార్మికులు కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారామె. దుర్వాసన వస్తున్న డ్రైనేజీలు శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కష్టం చూసి కన్నీరు పెట్టుకున్నారు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి. జగిత్యాల మార్కండేయ కాలనీలో ప్లాస్టిక్ బాటిళ్లతో నిండిపోయిన డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా... ఓ పారిశుద్ధ్య కార్మికుడి కాలు అందులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డాడు. ఈ సమయంలో పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని చూసి చలించిపోయారు మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి. డ్రైనేజీ నిండిపోయిందని స్థానిక కౌన్సిలర్ చేసిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కమిషనర్ స్వరూపారాణి అక్కడికి వెళ్లి పరిశీలించారు. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసే వేయాలని చెప్పినా.. ప్రజలు ప్లాస్టిక్ విచ్చలవిడిగా బయట  పారేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల మున్సిపల్ కమిషనర్.