డబుల్​ ఇంజన్​ సర్కారుతోనే అభివృద్ధి : మునిస్వామి

డబుల్​ ఇంజన్​ సర్కారుతోనే అభివృద్ధి : మునిస్వామి

మక్తల్, వెలుగు: దేశంలో, రాష్ట్రంలో డబుల్​ ఇంజిన్​ సర్కారు ఉంటేనే జెట్​ స్పీడులో అభివృద్ధి జరుగుతుందని, ఇప్పటికే కేంద్రంలో బీజేపీ సర్కారు ఉందని రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కర్నాటక రాష్ట్రం కోలార్​ ఎంపీ మునిస్వామి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్  అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్​రెడ్డి తరపున శుక్రవారం ఆయన కృష్ణా మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలంధర్​రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాడన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి కూడా సక్కగా రోడ్డు లేదన్నారు. సంగంబండ, భీమా రిజర్వాయర్ల ముంపు బాధితులకు ఇప్పటివరకు పరిహారం డబ్బులు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

తాము అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర నాయకుడు కొండయ్య మాట్లాడుతూ జలంధర్​రెడ్డి తన సొంత డబ్బులతో గ్రామాలకు రోడ్లు వేయించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా నర్వ మండలం ఉందేకోడ్​ గ్రామానికి చెందిన వివిధ పార్టీల లీడర్లు జలంధర్ రెడ్డి సతీమణి పద్మజా రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. కర్నే స్వామి, సోమశేఖర్ ​గౌడ్, కల్లూరి నాగప్ప, పూల శ్రీను, శ్రీనివాస్​రెడ్డి, గంగాధర్​గౌడ్  పాల్గొన్నారు.