ప్రతిఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

ప్రతిఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

చండూరు, వెలుగు: ప్రతి రాజకీయ నాయకుడు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోని సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. 

నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఒకటే పనిచేస్తే సరిపోదని, నాయకులందరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సంపాదన ఎక్కువగా ఉన్న నాయకులు తమ వంతుగా నిధులు ఇచ్చి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. మర్రిగూడలోని కస్తూర్బా బాలిక పాఠశాలలో అదనపు తరగతి గదులు, బాత్రూంలు, టాయిలెట్స్, నూతన డ్రైనేజీ సిస్టం వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.  సమావేశంలో అన్ని మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.