మీకు అండగా నేనుంటా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మీకు అండగా నేనుంటా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాల్టీ పారిశుద్ధ్య కార్మికులకు మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొంత కాలంగా తమకు వేతనాలు రావడం లేదని ఈ నెల 1 వతేది నుంచి చండూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన చేశారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతినెలా వేతనం అందేలా ప్రయత్నిస్తానన్నారు.  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి హామీ ఇవ్వడంతో  పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన విమరమించారు.  అధికారులతో చర్చించి మున్సిపాలిటీలో ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని చండూరు మున్సిపల్​ కమిషనర్​ ను ఆదేశించారు. మున్సిపాల్టీకి రావలసిన ఇంటి పన్నులు.. ఇతర పన్నులు వసూలు చేసి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలని సూచించారు.