
సూర్యాపేట, వెలుగు : హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతుండడంతో మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. మూసీ రిజర్వాయర్‌లోకి 3,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో మంగళవారం రెండు గేట్లను ఓపెన్ చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 642.90 అడుగుల (3.91 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. రెండు గేట్ల ద్వారా 3,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.