
యాదాద్రి, వెలుగు : హైదరాబాద్‌తోపాటు జిల్లాలో కురిసిన వర్షం కారణంగా మూసీకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కురిసిన వానతో వలిగొండ మండలం సంగెంలోని భీమలింగం కత్వ వద్ద ఉన్న లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిపివేశారు.
ఇరువైపులా బారికేడ్లు పెట్టి పోలీసులు కాపలాగా నిలిచారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద లోలెవ్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. రాత్రి నుంచి బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. యాదాద్రి జిల్లాలో శనివారం రాత్రి కొన్ని చోట్ల భారీ వాన కురిసింది. గుండాల మండలంలో 41.8 ఎంఎం కురువగా, ఆలేరు మండలంలో 35.2 ఎంఎం వాన కురిసింది. జిల్లావ్యాప్తంగా యావరేజ్‌గా 12.7 ఎంఎం వర్షపాతం నమోదైంది.