లోగోలో మెరుపులు.. మస్క్ కు కొత్త చిక్కులు

లోగోలో మెరుపులు.. మస్క్ కు కొత్త చిక్కులు

శాన్​ఫ్రాన్సిస్కో : ట్విట్టర్​ పిట్ట స్థానంలో ఎక్స్​ లోగోను తీసుకువచ్చిన మస్క్​కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. శాన్​ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్​ ప్రధాన కార్యాలయం పై నుంచి ఈ లోగో సింబల్​ను తొలగించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్​ లోగోలో సాధారణ స్థాయి కన్నా ప్రకాశవంతమైన లైటింగ్​ను ఉపయోగించారు. 

ఈ లైటింగ్​ ఫోకస్​ చుట్టుపక్కల వారి ఇళ్లలోకి నేరుగా పడుతోందట. ఇది వారి నిద్రకు భంగం కలిగిస్తుందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హెడ్​ ఆఫీస్​ పైనుంచి ఈ లోగోను తొలగించారు. ఎక్స్​ లోగో అశ్లీల సైట్​కు సింబల్​లా ఉందంటూ నెట్టింట ట్రోలింగ్​ జరుగుతోంది. ఈ లోగో ఏర్పాటుపై తమ అనుమతి తీసుకోలేదంటూ ఇప్పటికే శాన్​ఫ్రాన్సిస్కో యంత్రాంగం విచారణకు ఆదేశించింది.