
జీడిమెట్ల, వెలుగు: వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తెనాలి పరిధిలోని చెంచుపేటకి చెందిన షేక్‌మస్తాన్ బాషా కూతురు షేక్ షహీన్(22)ను ఒంగోలు పరిధిలోని తోవగుంటకు చెందిన షేక్సాజిద్(28)కి ఇచ్చి 2018లో పెళ్లి చేశారు.
భార్యభర్తలు ఇద్దరు కుత్బుల్లాపూర్ సీపీఆర్ కాలనీలో ఉంటున్నారు. షాజిద్ టైల్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్. వీరికి ఓ పాప ఉంది. పెళ్లి జరిగిన 4 నెలలు బాగానే ఉన్న సాజిద్ అనంతరం కట్నం కోసం షహీన్‌ను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. పెద్దలు పంచాయితీ పెట్టి నచ్చజెప్పి పంపించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. రోజూ తాగొచ్చి వేధించేవాడు. తట్టుకోలేకపోయిన షహీన్మంగళవారం తెల్లవారు జామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పక్కింటి వాళ్ల సమాచారంతో షహీన్తల్లిదండ్రులు వచ్చి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.