రాముడి ఆలయాన్ని శుభ్రం చేసిన ముస్లింలు

రాముడి ఆలయాన్ని శుభ్రం చేసిన ముస్లింలు

కేరళ : హిందూముస్లిం భాయిభాయి అనే నినాదాన్ని చాటి చెప్పారు కేరళలోని కొందరు యూత్. హిందూ, ముస్లిం యువకులు చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కొన్ని రోజులుగా కేరళను వరదలు ముంచెత్తడంతో పలు ఆలయాలు, మసీదులు నీటమునిగాయి. ఈ క్రమంలో సేవ చేయడానికి ముందుకు వచ్చారు కొందరు ముస్లిం యువకులు. వయనాడ్ లోని సుల్తాన్ బాథరీలో రాముడి ఆలయమూ నీటిలో మునిగింది. అయితే ఆదివారం నీటిమట్టం తగ్గడంతో ముస్లిం యూత్ లీగ్ వాలంటీర్లు ఆలయాన్ని శుభ్రం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ ఫోటొలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముస్లింలు అయి ఉండి కూడా హిందువుల దేవాలయాలను క్లీన్ చేసి సమాజానికి గుడ్ మెసేజ్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ముస్లిం యువకులు చేసిన మంచి పనికి కొందరు హిందూ యువకులు అండగా నిలిచారు. సోమవారం బక్రీద్ సందర్భంగా కన్నూర్లోని కురుమత్తూరు జుమా మసీదును హిందువులు శుభ్రం చేశారు. దీంతో మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని నిరూపించారు ఈ కేరళ యువకులు. హ్యాట్సాఫ్ బ్రదర్స్ అంటూ వారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.