
రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి రూపొందిస్తున్న చిత్రం ‘మటన్ సూప్’. విట్‌నెస్ ది రియల్ క్రైమ్ అనేది ట్యాగ్‌లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను నిర్మాత కె.ఎస్.రామారావు విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆకట్టుకునే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని హీరో రమణ్ అన్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, లైన్ ప్రొడ్యూసర్ కొమ్మా రామ కృష్ణ, ఎడిటర్ లోకేష్ కడలి, నటుడు గోవింద్ రాజ్ నీరుడి తదితరులు పాల్గొన్నారు.