
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూతుపురాణం అందుకున్నారు. రా చూసుకుందాం అని హెచ్చరించారు. రాయడానికి కూడా ఉపయోగించని కామెంట్లు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బండి సంజయ్.. నన్ను రెచ్చగొడుతున్నవ్. నీ మొహం నేనెప్పుడూ చూడలేదు. యూజ్లెస్ ఫెలో. పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్వైతే ఏమైనా చేయొచ్చనుకుంటున్నవా? నువ్వు ఏమిచేసినా నాకు సత్తావుంది. నువ్వు అడ్రస్ లేనోడివి. ఏమి చేస్తవ్ నన్ను. తిరగనియ్యవా.. నీకు దమ్ముంటే రా. నా సత్తా ఏందో చూపిస్తా” అని ఊగిపోయారు. తనకు ప్రజల బలం ఉందని, తాను సీనియర్ మోస్ట్ లీడర్నని, తన ముందు సంజయ్ బచ్చా అని వ్యాఖ్యానించారు. ‘‘నేను నిన్ను కలిసింది నిరూపిస్తే నీకు గులాంగిరి చేస్తా, పాలిటిక్స్‌ని వదిలేస్తా, పాలిటిక్స్‌తో బతికెటోడ్ని కాదు. మర్డర్ల గురించి మాట్లాడుతున్నవ్. ఏం మాట్లాడుతున్నవ్.. తెలివిలేద్. వల్గర్‌గా మాట్లాడుతున్నవ్. నీకే మాట్లాడనీకి వస్తదా? గుండు పలగ్గొడతా” అని హెచ్చరించారు.
నేనంటే హడల్
తన క్యాడర్ ముందు సంజయ్ ఎంత అని మైనంపల్లి అన్నారు. ‘‘మొత్తం జిల్లా జిల్లాల నుంచి వస్తయ్. మైనంపల్లి అంటే హడల్. మైనంపల్లి సర్వీసెస్ అన్ని జాగల్ల, ప్రతి ఊర్ల ఉన్నయ్. సంజయ్.. నన్ను యూజ్లెస్ ఫెలో అంటవా. నా ముందు నువ్వు బచ్చాగానివి. నువ్వెంత .. నీ బతుకెంత? రోజులు లెక్క పెట్టుకో. నీకు గుండు కొట్టించే దాకా నిద్రపోను. వాళ్లని తిట్టినా, వీళ్లని తిట్టినా అని మాట్లాడుతున్నవ్. నీ ముందు తిట్టిన్నా? రేపటి నుంచి చూపిస్తా. బిడ్డా.. నేను నీకు వార్నింగ్ ఇస్తున్న. నిన్ను ఏడ తిరగనియ్య” అంటూ హెచ్చరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సంజయ్ ఓడిపోయేదాకా వెంటపడుతానన్నారు. ‘చూపిస్త మైనంపల్లి అంటే ఏందో. జాన్ గయాతో ఫరక్ నైపడ్త, షాన్ మె ఫరక్ నహీ ఆత. సత్తా ఉంటే ఎదుర్కో. ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. హైదరాబాద్ సిటీ సెంటర్‌కు రమ్మంటే వస్తా. రేపు హుజూరాబాద్ పోతున్న. దమ్ముంటే.. రమ్మంటే కరీంనగర్ వచ్చి హుజూరాబాద్ పోత” అని సవాల్ విసిరారు.