
న్యూఢిల్లీ: ఫ్యాషన్ రిటైలర్ మింత్రా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను త్వరగా డెలివరీ చేయడానికి హైదరాబాద్లో ‘ఎంనౌ’ సర్వీసును హైదరాబాద్లో ప్రారంభించింది. ఇది వరకే ఇది బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో విజయవంతమైందని ప్రకటించింది. దీంతో నగరంలో కస్టమర్లు ఇప్పుడు 500కి పైగా బ్రాండ్లకు చెందిన 8 వేలకు పైగా స్టైల్స్‌ను 30 నిమిషాల్లోపు పొందవచ్చు.
దేశవ్యాప్తంగా 60 డార్క్ స్టోర్ల నెట్వర్క్ ద్వారా ఈ సర్వీస్‌ను విస్తరించినట్లు మింత్రా తెలిపింది. మింత్రా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షారన్ పైస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ట్రెండ్కు అనుగుణంగాఉండే కస్టమర్లతో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్అని, అందుకే ఎం-నౌకు ఇది ముఖ్యమైన మార్కెట్ అని చెప్పారు. ప్రస్తుతం 600కి పైగా నగరాల్లో దాదాపు 50 శాతం ఆర్డర్లు 48 గంటల్లో డెలివరీ అవుతున్నాయని వివరించారు.