15 మంది నక్సల్ కమాండర్స్ తో పని చేసిన శేషన్న

15 మంది నక్సల్ కమాండర్స్ తో పని చేసిన శేషన్న

నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నానక్ రామ్ గూడ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న శేషన్నను అదుపులోకి తీసుకున్నారు. శేషన్నపై వివిధ పోలీస్ స్టేషన్లలో 9 కేసులు ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ నయీంతోకలిసి అనేక నేరాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 15 మంది నక్సల్ కమాండర్లతో కలిసి పనిచేశారు శేషన్న.. శేషన్నపై పలు కిడ్నాప్ లు, మర్డర్ లు ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు ఉన్నాయి. ఆరు మర్డర్ కేసులు, మూడు ఆర్మ్స్ యాక్ట్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. శేషన్న దగ్గర 9ఎంఎం పిస్టల్ ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

1993లో శేషన్నను మొదటిసారి  సనత్ నగర్  పోలీసులు అరెస్ట్ చేశారు.ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. నయీం తో కలిసి మావోయిస్ట్ అవతారం ఎత్తాడని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులతో శేషన్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు చెబుతున్నారు. మావోయిస్టులకు కొరియర్ గా, డెన్ కీపర్ గా పని చేసిన శేషన్న పై పలు కిడ్నాప్, మర్డర్, ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు  ఉన్నాయని చెప్పారు.