
ప్రభాస్ సినిమాల లైనప్ కాస్త పెద్దగానే ఉంది. ప్రస్తుతం రాధేశ్యామ్, సాలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. అయితే నాగ్ అశ్విన్‌తో సినిమా సాలార్, ఆదిపురుష్ చిత్రాల కంటే ముందు మొదలు కావాల్సి ఉంది. ఏవో టెక్నికల్ రీజన్స్‌తో లేటైంది. ఎట్టకేలకి వెయిటింగ్ ముగిసింది. ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల చిత్రం నిన్న రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లో పాల్గొనడానికి బిగ్‌బీ హైదరాబాద్ వచ్చారు. ఆయనపై తీసిన మొదటి షాట్‌కి ప్రభాస్ క్లాప్ కొట్టాడు. క్లాప్ బోర్డ్‌పై ‘ప్రాజెక్ట్ కె’ అని రాసి ఉండటాన్ని బట్టి ఆ వర్కింగ్ టైటిల్‌తో సినిమాని పట్టాలెక్కించారని అర్థమవుతోంది. ‘గురుపౌర్ణమి నాడు ఇండియన్ సినిమా గురు అయిన అమితాబ్ గారికి క్లాప్ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను’ అని ప్రభాస్ అంటే.. ‘బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా మ్యాజికల్ వేవ్స్‌ని విస్తరింపజేసిన ఐకాన్ ప్రభాస్ నా షాట్‌కి క్లాప్ కొట్టడం గౌరవంగా ఫీలవుతున్నాను’ అని అమితాబ్ అన్నారు. దీపిక కూడా ‘ప్రాజెక్ట్ కెలో ఇది మొదటి రోజు. ముందు ముందు జరగబోయేది తలచుకుంటే నేను చాలా థ్రిల్ ఫీలవుతున్నాను’ అని సోషల్ మీడియాలో సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో లీడ్ యాక్టర్స్ అందరిపై కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తీయబోతున్నారు. అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా కథ, కథనం, తెరకెక్కించే విధానం.. అన్నీ ప్రేక్షకులకు కొత్తగా, ఆశ్చర్యంగా ఉంటాయట. ఇండియన్ పవర్‌హౌస్ యాక్టర్స్, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేటై ఉన్నారట. అంతర్జాతీయ నటీనటులు కూడా భాగమయ్యారట. దర్శక నిర్మాతలు చెబుతున్న ఈ విషయాలు ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు యూనిట్. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న సెట్ ఇది. ఇంకా ఇలాంటి అద్భుతాలు ఎన్ని క్రియేట్ చేయనున్నారో ఏమో!