NC24: నాగ చైతన్య మైథికల్ థ్రిల్లర్.. ఓ భారీ గుహ సెట్.. నిధి అన్వేషకుడిగా చైతన్య

NC24: నాగ చైతన్య మైథికల్ థ్రిల్లర్.. ఓ భారీ గుహ సెట్.. నిధి అన్వేషకుడిగా చైతన్య

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌‌‌‌తో ఫుల్ జోష్‌‌‌‌లో ఉన్నారు నాగ చైతన్య మరియు మీనాక్షి చౌదరి. వీరిద్దరూ కలిసి ఓ మైథికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. . ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి పాత్ర గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ మిస్టిక్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో తను ఆర్కియాలజిస్ట్‌‌‌‌గా కనిపించనుందట. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు నాగ చైతన్య. తన పాత్ర కోసం ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంప్లీట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ అయ్యాడు.

ఇటీవలే ‘పాతి పెట్టిన రహస్యాలు, కాలానికి అతీతంగా ది ర్యాగింగ్ మిథికల్ థ్రిల్లర్ ప్రారంభమైంది’అంటూ వీడియోకి క్యాప్షన్ ఇస్తూ రిలీజ్ చేశారు. ఈ వీడియోతో ఇందులో నిధి అన్వేషకుడిగా చైతన్య నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. 

ఇకపోతే ఇందులో హిందీ మూవీ ‘లాపతా లేడీస్‌‌‌‌’ఫేమ్ స్పర్ష్‌‌‌‌ శ్రీవాత్సవ ఇందులో విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. దర్శకుడు కార్తీక్ దండు గత చిత్రం ‘విరూపాక్ష’ తరహాలో ‘వృషకర్మ’ (కార్యసాధకుడు) అనే  వైవిధ్యమైన టైటిల్‌‌‌‌ను పరిశీలిస్తున్నారు.

►ALSO READ | Manoj Comments: శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు.. మంచు విష్ణుపై మనోజ్ సెటైరికల్ పంచ్!.. వీడియో వైరల్

డైరెక్టర్ కార్తీక్ దండు విజన్పై విరూపాక్ష మూవీతో ప్రతిఒక్కరికీ తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నారు. ప్రత్యేకంగా, ఈ చిత్రానికి అధిక స్థాయిలో సీజీ వర్క్ ఉండనుందట. ఇది ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్‌ అనుభూతిని అందించేందుకు సహాయపడుతుంది.

అందుకు తగ్గట్టుగానే నీల్ డి కున్హా డీవోపీగా, నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, నవీన్ నూలి ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. SVCC,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌‌‌‌పై బీవీఎస్‌‌‌‌ఎన్  ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.