నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు కీలకమని నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో అబ్జర్వర్ రాజ్యలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ దేవ సహాయంతో కలిసి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలించాలని, పీవోలు, ఏపీవోల విధుల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు.
ప్రతి అంశాన్ని పరిశీలించాలని, ఉదయం 6 గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని కోరారు. సీఈవో గోపాల్ నాయక్, డీపీవో శ్రీరాములు, ఎల్డీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లాలోని పేద విద్యార్థులందరికీ స్కాలర్షిప్ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ నెల 30 వరకు 100 శాతం అప్లై చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ అమరేందర్, డీఈవో రమేశ్ కుమార్, సంక్షేమ శాఖ అధికారులు ఉమాపతి, ఫిరంగి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
నామినేషన్ల ఉపసంహరణ పరిశీలన..
కందనూలు: బిజినేపల్లి మండలం పాలెం క్లస్టర్‌లో రెండవ విడత ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియను కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో డిక్లరేషన్ తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కథలప్ప ఉన్నారు.
