Chiranjeevi: మెగాస్టార్ ఇంట తారల దీపావళి సంబరం.. ఒకే ప్రేమ్లో చిరు, నాగ్, వెంకీ మధ్యలో నయన!

Chiranjeevi: మెగాస్టార్ ఇంట తారల దీపావళి సంబరం.. ఒకే ప్రేమ్లో చిరు, నాగ్, వెంకీ మధ్యలో నయన!

పార్టీలు, సెలబ్రేషన్స్, ఈవెంట్స్: ఇవెప్పుడు టాలీవుడ్కి ఓ కళే. అలాంటిది తమ సినిమాలతో ఫ్యాన్స్కి, ఎన్నో పండుగలు అందించిన టాప్ స్టార్స్ ఏకమై జరుపుకుంటే.. అది నిజమైన పండుగే. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలందరూ పండుగ వచ్చిందంటే చాలు, ఒకచోట కలుసుకుని సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఈ సంస్కృతి, మన టాలీవుడ్లో కూడా గత మూడేళ్ళుగా మొదలైంది.

దీపావళి సందర్భంగా, నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. టాలీవుడ్కి సంబంధించిన పలువురు హీరోలను తన ఇంటికి పిలిచి గ్రాండ్ విందు ఇచ్చారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన ఇంట్లో దీవాళీ వేడుకలను, టాప్ సెలబ్రెటీస్తో జరుపుకోవడం టాలీవుడ్లో విశేషంగా మారింది.

చిరంజీవి ఇచ్చిన ఈ పార్టీలో ‘నాగ్-అమల’, ‘వెంకీ-నీరజ’ లతో పాటుగా టాప్ హీరోయిన్ నయనతార కూడా పాల్గొని సందడి చేసింది. వారిని చిరంజీవి ప్రత్యేకంగా ఆహ్వానించి మంచి దివాళీ పార్టీ అందించారు. 

లేటెస్ట్గా చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ, బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చాడు. ‘‘నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్, నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు మరియు ఐక్యతను గుర్తు చేస్తాయని’’ చిరు తన ఆనందాన్ని పంచుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘‘టాలీవుడ్ దిగ్గజ స్టార్స్ అయిన చిరు,నాగ్,వెంకీలు ఒకేచోట ప్రేమగా కలవడంతో.. తమ ఫ్యాన్స్కి నిజమైన పండుగ తీసుకొచ్చిందని’’ సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫ్యాన్స్ సైతం స్పెషల్ ట్వీట్స్తో, ఫోటోలు షేర్ చేస్తూ.. భలే ఖుషి అవుతున్నారు.   

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో చిరు, నయనతార కలిసి నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్ సైతం ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే, వీరిద్దరికి సంబంధించిన షూటింగ్ సైతం అనిల్ కంప్లీట్ చేసినట్లు టాక్. త్వరలో వెంకీమామ ఎంట్రీకి సంబంధించి అధికారిక అప్డేట్ రానుంది.

అలాగే, నాగ్ వందో సినిమా కూడా ఇటీవలే ప్రారంభమైంది. తమిళ డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ మైల్ స్టోన్ మూవీలో నాగ్కి జోడీగా నయనతార నటిస్తున్నట్లు సమాచారం. అందువల్ల, ఈ దీపావళికి చిరు ఇంట్లో..  నాగార్జున, వెంకటేష్, నయనతార కలిసి సెలెబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.