
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) త్వరలో మొదలు కానుంది. ఈ సారి కూడా ఈ షోకి కింగ్ నాగార్జున(Nagarjuna)నే హోస్ట్ గా చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోస్ కు ఆడియన్స్ నుండి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు మొదలుకానుంది అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. కానీ ఈ షో ఎప్పటినుండి మొదలుకానుంది అనే డేట్ మాత్రం రివీల్ చేయలేదు మేకర్స్.
తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సీజన్ కోసం నాగార్జున రికార్డ్ రెమ్యునరేషన్(Nagarjuna Remunration) తీసుకోనున్నారట. సీజన్ మొత్తానికి కలిపి ఏకంగా రూ.200 కోట్ల భారీ మొత్తాన్ని పారితోషకంగా తీసుకోనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ సీజన్ ను కూడా చాలా కొత్తాగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ప్రోమోలో కూడా చూపించారు. ఈ ప్రోమోలో నాగార్జున ఈసారి అంతా ఉల్టా పుల్టా అనే డైలాగ్ చెప్పారు. దీంతో ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. లాస్ట్ సీజన్ లా కాకుండా ఈ సీజన్ సరికొత్తగా ఉండనుంది అనే విషయం అర్థమవుతోంది. మరి ఎన్ని అంచనాల మధ్య వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఆడియన్స్ ను ఏ రేంజ్లో మెప్పించనుంది అనేది చూడాలి.