వరద ఉధృతి పెరగడంతో సాగర్ 14 గేట్లు ఓపెన్

వరద ఉధృతి పెరగడంతో సాగర్ 14 గేట్లు ఓపెన్

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు వరద ఉధృతి పెరిగింది. దీంతో  ప్రాజెక్ట్14 క్రస్ట్ గేట్లను 5 ఫీట్లు ఎత్తి 1,12,966 క్యూసెక్కుల దిగువకు వదులుతున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి 1,67,440 క్యూసెక్కుల వదర వస్తుండడంతో అంతే మొత్తంలో కిందికి విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి నీటి నిలువ సామర్థ్యం 590 అడుగుల( 312. 0450 టీఎంసీలు)కు గాను ప్రస్తుతం 589.70 అడుగులు( 311. 1486 టీఎంసీ ) ఉంది. ఇందులోంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 33, 820, కుడికాల్వకు 9,500, ఎడమకాల్వకు 8,454 , ఎమ్మార్పీకి 2400, ఎస్ఎల్బీసీకి 300 క్యూసెక్కుల చొప్పున నీటిని అవుట్ ఫ్లో గా పంపిస్తున్నారు.