
హాలియా, వెలుగు : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను బుధవారం మూసివేశారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో గేట్లను క్లోజ్ చేసి నీటి విడుదలను నిలిపివేశారు. ఎగువ నుంచి సాగర్‌కు 52,011 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు (312.0450 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 586.10 అడుగుల (300.8385 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వకు 10 వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5,654, ఏఎమ్మార్పీకి 1,800, ఎల్‌ఎల్‌సీకి 300, పవర్‌హౌస్‌కు 33,657 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.