
భారీ వరదల కారణంగా ఇటీవల నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో విజిటర్స్ తాకిడి ఎక్కువయ్యింది. వీకెండ్ కావడంతో ఆదివారం (ఆగస్టు 03) వేల సంఖ్యలో సందర్శకులు సాగర్ ను చూసేందుకు వచ్చారు. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనాలు వస్తుండటంతో డ్యాం చుట్టూ జనసందోహం నెలకొంది.
విజిటర్స్ భారీగా వస్తుండటంతో సాగర్ దగ్గర భారీగా ట్రాంఫిక్ జాం అయ్యింది. వాహనాలు దాదాపు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ జాం లో చిక్కుకుని ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
మరోవైపు వర్షాలు తగ్గటంతో నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను మూసివేశారు. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జులైలో ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో సాగర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ప్రస్తుతం గేట్లు మూసివేయటంతో ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాల్సిందిగా అధికారులు సూచించారు.