కూసుమంచి, వెలుగు: తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్‌నుంచి బుధవారం 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, శుక్రవారం మధ్యాహ్నానికి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయానికి చేరుకున్నాయి. ఇప్పటికే పాలేరు జలాశయం డెడ్‌స్టోరేజీకి చేరింది. కేవలం10.60 అడుగుల మేర నీరు ఉంది.
ఇక్కడి నుంచి డెయిలీ మిషన్‌భగీరథ కింద ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబూబాద్జిల్లాలలోని ప్రాంతాలకు125 క్యూసెక్కుల నీరు అందిస్తున్నారు. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం(23 అడుగులు) వరకు నీటిని నింపాలని, బుధవారం సాగర్‌జలాలు విడుదల చేశారు.
సాగర్‌జలాలను నాయకన్‌గూడెం ఇన్ఫాల్రెగ్యులేటర్వద్ద ఐబీ ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు, డీఈ రమేశ్‌రెడ్డి పరిశీలించారు. శుక్రవారం నాటికి 136 క్యూసెక్కుల నీరు రాగా, శనివారం నాటికి 4 వేల క్యూసెక్కులకు చేరుతుందని తెలిపారు.