Kubera : కుబేర కోసం.. పోర్షన్‌‌‌‌‌‌‌‌ డబ్బింగ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసిన నాగార్జున

 Kubera : కుబేర కోసం.. పోర్షన్‌‌‌‌‌‌‌‌ డబ్బింగ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసిన నాగార్జున

హీరో  నాగార్జున ఓవైపు  తన కొడుకు అఖిల్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాలపై తనకున్న ప్యాషన్‌‌‌‌‌‌‌‌ను చాటుకున్నారు.   ఇంట్లో అబ్బాయి పెళ్లి చేసిన కొన్ని గంటల్లోనే  ఆయన నటిస్తున్న సినిమాలోని  తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు.  ధనుష్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన నటిస్తున్న ‘కుబేర’ చిత్రానికి తన పోర్షన్‌‌‌‌‌‌‌‌ డబ్బింగ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేశారు నాగార్జున. ఈ సందర్భంగా  డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, దర్శకుడు  శేఖర్ కమ్ముల, నిర్మాత పుస్కూర్ రామ్ మోహన్  కలిసి మాట్లాడుతున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు. 

ఇందులో  నాగార్జున ఈడీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న  హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌‌‌‌‌‌‌‌ మోహన్ రావు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్  20 న  తెలుగు, తమిళ,  కన్నడ, మలయాళ, హిందీ  భాషలలో  విడుదల కానుంది.  ఇప్పటికే విడుదలైన  ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌కి మంచి రెస్పాన్స్ రావడంతోపాటు సినిమాపై అంచనాలు పెంచాయి. దేవిశ్రీ ప్రసాద్  ఈ చిత్రానికి  సంగీతం అందిస్తున్నాడు.