ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
  • నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని నాగార్జునసాగర్​ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. బుధవారం హాలియా పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.27 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు టీచర్లు కృషి చేయాలని సూచించారు.

 ఉపాధ్యాయుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారికి పదోన్నతులు కల్పించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు గుండ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అనుపమానరేందర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ సుధారాణి రాజారమేశ్​యాదవ్, నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.