నిలకడగా నాగార్జునసాగర్ నీటి మట్టం..589.70 అడుగులకు చేరిక

నిలకడగా నాగార్జునసాగర్ నీటి మట్టం..589.70 అడుగులకు చేరిక

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వదర నీటి కారణంగా సాగర్ ప్రాజెక్ట్​ గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరువలోకి వచ్చింది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ కు 65,530 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

 సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రం 6 గంటలకు వరకు 589.70 అడుగుల (311.1486 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సాగర్​జలాశయం నుంచి ఎడమ కాల్వకు 7,436 క్యూసెక్కులు, కుడి కాల్వకు 6,041 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు ఏఎమ్మార్పీకి 1800 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు.