అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా వీరభద్రుడు రిలీజ్

అన్నపూర్ణ  స్టూడియోస్  ద్వారా వీరభద్రుడు రిలీజ్

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం ‘కరుప్పు’. తెలుగులో ‘వీర భద్రుడు’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో  విడుదలవుతోంది. 

  మే 14న తెలుగు, తమిళ భాషల్లో  రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది. అయితే తమిళనాడులో జరుగుతున్న  రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడనుందని ప్రచారం జరిగింది.  ఇదంతా అవాస్తవమని చెబుతూ..   ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా మే 14న విడుదలవుతోందని క్లారిటీ ఇచ్చింది. ఆదివారం నుంచి తమిళనాడులో బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయని స్పష్టం చేశారు మేకర్స్. సూర్యకు జంటగా  త్రిష  హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ రవి కీలక పాత్రలు పోషించారు.  సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు.  ఇప్పటికే విడుదలైన సాంగ్స్,  టీజర్  సినిమాపై బజ్‌‌‌‌‌‌‌‌ను పెంచాయి.