నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నామినేషన్ కేంద్రాల్లోకి అభ్యర్థితో పాటు ముగ్గురినే అనుమతించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు జీపీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.
రైతులు అప్రమత్తత ఉండాలి
మంగళ, బుధవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. సోమవారం తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో వడ్లు, పత్తి తడవకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వడ్లు, పత్తిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్ల తడవకుండా అవసరమైన టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. అడిషనల్ కలెక్టర్ పి అమరేందర్, డీఏవో యశ్వంత్ రావు, డీఆర్డీవో చిన్న ఓబులేషు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నరసింహారావు పాల్గొన్నారు.
