ఫైర్‌‌‌‌ సేఫ్టీ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి : నాగిరెడ్డి

ఫైర్‌‌‌‌ సేఫ్టీ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి : నాగిరెడ్డి

గచ్చిబౌలి, వెలుగు : ప్రతి ఒక్కరు ఇంట్లో, షాపుల్లో ఫైర్‌‌‌‌ సేఫ్టీ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌ నాగిరెడ్డి సూచించారు. హైదరాబాద్‌‌‌‌ వట్టినాగులపల్లిలోని ఫైర్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ‘అగ్ని నివారణ చర్యలు చేపడుతాం – దేశ సంపదను కాపాడుకుందాం’ అనే థీమ్‌‌‌‌తో  ఈ సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

 వారోత్సవాల్లో భాగంగా స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్‌‌‌‌లో ప్రజలకు అవగాహన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎండాకాలంలో ఎక్కువ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కడైనా ఫైర్‌‌‌‌ యాక్సిడెంట్‌‌‌‌ జరిగితే వెంటనే ఫైర్‌‌‌‌ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ఐదు ఫ్లోర్స్‌‌‌‌ ఉన్న ప్రతి బిల్డింగ్‌‌‌‌లో ఫైర్‌‌‌‌ సేఫ్టీ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మందుగా అగ్ని ప్రమాదాల్లో చనిపోయిన ఫైర్‌‌‌‌ సిబ్బందికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌వో సుధాకర్‌‌‌‌రావు, ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌వో హరినాథ్‌‌‌‌రెడ్డి, డీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ లక్ష్మీప్రసాద్, ఏడీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ జీవీ.నారాయణరావు పాల్గొన్నారు.