Viral Post: పట్టపగలు దోపిడీ : అన్నం, కూరకు రూ.500

 Viral Post: పట్టపగలు దోపిడీ : అన్నం, కూరకు రూ.500

ఎయిర్‌పోర్టుల్లో ఆహార పదార్థాల విపరీతమైన ధరలపై ప్రయాణికులు నిత్యం వేధిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో, ఒక అసంతృప్తి చెందిన వ్యక్తి విమానాశ్రయ సేవలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, రూ. 'రాజ్మా చావల్' మరియు ఒక కోక్ సర్వింగ్ కోసం రూ.  500 వసూలు చేశారు. ఈ ఘటన ఇంటర్నెట్‌లో దుమారం రేపింది.

ఎయిర్​ పోర్టుల్లో.. రైల్వే స్టేషన్లలో... బస్​ స్టేషన్లలోని షాపింగ్​ మాల్స్​ లో MPR రేటు కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకుంటాం అని బోర్డులుంటాయి.. అయినా సరే ఐదు రూపాయిల వరకు ఎక్కువ తీసుకుంటారు.  ఈ విషయాన్ని జనాలు పెద్దగా లెక్కలోకి తీసుకోరు.  నాగ్​పూర్​ ఎయిర్​ పోర్టులో నార్మల్​ గి అన్నం.. కూర కొన్నందుకు రూ. 500 లు చార్జి చేశారు.   ఈ విషయాన్ని విక్రయదారుడు నాగ్​పూర్​ మార్కెటింగ్ కాన్సెప్ట్‌ల వివరణకర్త డాక్టర్ సంజయ్ అరోరా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.  ఈ విషయాన్ని అయన ట్విట్టర్​ లో పోస్ట్​ చేస్తూ  పట్టపగలు దోపిడి అని ట్యాగ్​ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్​ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వార్త  187K వీక్షణలను పొందింది.

సాధారణంగా ఎయిర్​ పోర్టుల్లో రేట్లు అధికంగా ఉంటాయి.  నాగ్​ పూర్​ ఎయిర్​ పోర్ట్​ లో అన్నం.. కూర రూ. 500 లకు విక్రయించడం.. ఇప్పుడు సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​ గా మారింది.ఈ విషయాన్ని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతోనే వైరల్​ అయింది.  ఈ పోస్ట్​ పై నెటిజన్లు స్పందించారు.  ఎయిర్​ పోర్టుల్లో పట్టపగలు దోపిడి నిజం అంటూ  భువనేశ్వర్​ ఎయిర్​ పోర్ట్​ లో ఒక కప్పు టీ రూ. 180, సమోసా రూ. 100 చెల్లించానని ఒకరు కామెంట్​ చేశారు.  కోల్​ కతా ఎయిర్​ పోర్ట్​లో టీ రూ. 300లకు అమ్ముతున్నారని మరొకరు పోస్ట్​ చేశారు.