మాజీ మంత్రిని కలిసిన ఎంపీ అభ్యర్థులు

మాజీ మంత్రిని కలిసిన ఎంపీ అభ్యర్థులు

నల్గొండ అర్బన్, వెలుగు : నల్లగొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులను ఆదివారం కే‌సీ‌ఆర్ ప్రకటించారు. అనంతరం నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ తెలంగాణ భవన్​లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్​రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

వారి వెంట నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున రెడ్డితోపాటు పలువురు నాయకులు ఉన్నారు.