యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ప్రతి కుటుంబానికి డిజిటల్కార్డు అందించాలనే లక్ష్యంతో ఆఫీసర్లు ముందుకు సాగాలని నల్గొండ కలెక్టర్సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం ఆఫీసర్లతో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబం వివరాలను సేకరించి డిజిటల్కార్డులు అందించాల్సి ఉందన్నారు. రక్షిత మంచినీరు, పారిశుధ్యం, ప్రభుత్వ సంస్థల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన 74 ఫిర్యాదులను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలని శాఖల వారీగా ఫార్వర్డ్ చేశారు.
అర్హులైన వారికి డబుల్ బెడ్రూంలు-..
అర్హులైనవారికి డబుల్ బెడ్రూంలు అందిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్నందలాల్పవార్ అన్నారు. దళారులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తన్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణిలో వచ్చిన 70 దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
యాదాద్రిలో 55 అప్లికేషన్లు..
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అందిన 55 ఫిర్యాదులను ఆయన పరిశీలించి పరిష్కరించాలని ఆఫీసర్లకు సూచించారు. రెవెన్యూశాఖ 35, జిల్లా ఎంప్లాయిమెంట్ 7, జిల్లా పంచాయతీ అధికారి 6, జిల్లా వ్యవసాయ శాఖ 2 మున్సిపాలిటీ, శిశు సంక్షేమ, అటవీ, కో-ఆపరేటివ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖల నుంచి ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు వచ్చాయి.