
దేవరకొండ, వెలుగు : గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరకొండ మండలం ముదిగొండ గ్రామ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల చెందిన 32 మంది విద్యార్థినులు ఈనెల 14న అస్వస్థతకు గురయ్యారు.
నాణ్యమైన భోజనం విషయంలో నాలుగో తరగతి ఉద్యోగులకు హెడ్మాస్టర్ సరైన సూచనలు ఇవ్వకపోవడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో హెడ్మాస్టర్ వేదాద్రిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.