
- రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్
నల్గొండ అర్బన్, వెలుగు : 2023-–24 రబీకి సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాన్ని వారంలోపు పూర్తిచేయాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం నల్గొండ కలెక్టరేట్ లో పీఎంఆర్ పై జిల్లాలోని రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-–24 రబీ సీఎంఆర్ కు సంబంధించి ఇంకా 73 ఏసీకే లు చెల్లించాల్సి ఉందని, వారం రోజుల్లో చెల్లించాలని చెప్పారు. 2024-–25 రబీకి సంబంధించిన సీఎంఆర్ ను సైతం వేగవంతం చేయాలన్నారు.
సీఎంఆర్ చెల్లింపులో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. సమావేశంలో డీఎస్ వో వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీశ్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.