బాల్క సుమన్ భూ బకాసురుడు.. భూములు కనిపిస్తే గుంజుకుంటాడు : నల్లాల ఓదెలు

బాల్క సుమన్ భూ బకాసురుడు.. భూములు కనిపిస్తే గుంజుకుంటాడు : నల్లాల ఓదెలు

మందమర్రిలో ఎక్కడకు వెళ్లినా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. దుర్మార్గుడి పాలన వద్దనే వివేక్ వైపు జనం వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తాకేదార్లు కాంగ్రెస్ వైపు ఉండొద్దని ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. భూ బకాసురుడు బాల్క సుమన్ కు మందమర్రిలో 100 ఎకరాలు ఉన్నాయన్నారు. ఎక్కడ భూములు కనిపించినా బలవంతంగా గుంజుకునే వ్యక్తి బాల్క సుమన్ అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలి.. దౌర్జన్యం చేసే అహంకారి బాల్క సుమన్ కు ఓట్లు వేయవద్దు అని అభ్యర్థించారు. 

చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామికి విశేష ఆదరణ లభిస్తోంది. ఎక్కడకు వెళ్లినా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జీ. వివేక్ కు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని చిర్రకుంట గ్రామంలో ఆదివారం (నవంబర్ 19న) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిర్రకుంట గ్రామస్తులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు ఘన స్వాగతం పలికారు. 

https://www.youtube.com/watch?v=_3ZST1qs76E