ములాయం కోడలికి బీజేపీ ఝలక్

ములాయం కోడలికి బీజేపీ ఝలక్

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ పార్టీ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. తాజాగా లక్నోలోని 9 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. లక్నో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన ములాయం కోడలు అపర్ణ యాదవ్ కు బీజేపీ ఝలక్ ఇచ్చింది. అదే స్థానాన్ని ఆశించిన పార్టీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషికి మొండిచెయ్యి చూపింది. మంగళవారం ప్రకటించిన జాబితాలో అపర్ణ, మాయాంక్లకు చోటు దక్కలేదు. వారిద్దరు కూడా లక్నో కంటోన్మెంట్ సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ మాత్రం ఇద్దరినీ కాదని యూపీ న్యాయశాఖ మంత్రి బ్రిజేష్ పాఠక్ను ఆ నియోజకవర్గం నుంచి బరిలో నిలపనున్నట్లు ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రీటా బహుగుణపై పోటీ చేసిన అపర్ణ ఓటమి పాలయ్యారు.

యూపీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్కు సైతం బీజేపీ షాక్ ఇచ్చింది. ఆమె ఆశించిన సరోజ్ నగర్ టికెట్ను వీఆర్ఎస్ తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారి రాజేశ్వర్ సింగ్ కు కేటాయించింది. గత ఎన్నికల్లో లక్నో పరిధిలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. 

For more news..

నారీ శక్తి.. ఇండియా ఉజ్వల భవిష్యత్తుకు సూచిక: నిర్మల

నైజీరియన్ గ్యాంగ్​ను అరెస్ట్ చేసిన ఎల్ బీనగర్ పోలీసులు